Home / జాతీయం
Waqf Bill 2024 : కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా బావిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రాబోతోంది. బిల్లుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఉభయ సభల ఆమోదం లభించేలా అధికార పార్టీ పట్టుదలగా ఉంది. పలు కారణాలతో విపక్షాలు విభేదిస్తున్న క్రమంలో బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్పీకర్ దీనిపై చర్చకు 8 గంటలు కేటాయించాలని నిర్ణయించారు. అనంతరం ఓటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం మూడులైన్ల విప్ జారీ […]
Yogi Adityanath : ప్రధాని మోదీ వారసత్వం గురించి మహారాష్ట్ర అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రానికి సీఎంను అన్నారు. పార్టీ తనను ఉత్తరప్రదేశ్ ప్రజల కోసం నియమించిందని చెప్పుకొచ్చారు. అందుకే యూపీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇక రాజకీయాలు తనకు ఫుల్‌టైమ్ జాబ్ కాదని, వాస్తవానికి తాను ఒక యోగినని ఆయన […]
Swami Nithyananda Death News: దేశంలో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద(47) మృతిచెందారని జోరుగా చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. స్వామి నిత్యానంద సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగం చేశారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ ప్రకటించడం వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, నిత్యానంద.. ఓ సినీ నటి రంజితతో కలిసి ఉండడం దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. అప్పటినుంచి ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనకు అహ్మదాబాద్ పట్టణంలో […]
Operation Brahma : భూకంపంతో మయాన్మార్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో మయాన్మార్‌ను ఆదుకునేందుకు ఆపరేషన్ బ్రహ్మను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాజా భారత్ మరో 50 టన్నుల సహాయక సామగ్రిని అందించింది. వివిధ రకాల సహాయక సామగ్రితో భారత్ నావికాదళానికి చెందిన సత్పుర, సావిత్రి నౌకలు యాంగూన్కు చేరుకున్నాయి. విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంసీసీ విమానాలతోపాటు నేవీకి చెందిన 5 నౌకల ద్వారా ఇండియా ఆపరేషన్ బ్రహ్మ […]
Amit Shah : 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు తగ్గినట్లు వెల్లడించారు. నక్సల్ రహిత భారత్‌ను నిర్మించే దిశగా మరో మైలు రాయిని చేరుకున్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కొన్ని రోజులుగా వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య […]
Seventeen killed in blaze at firecracker factory in Gujarat’s Banaskantha: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బనస్కాంతాలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు 17 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం.. దీసా పట్టణానికి సమీపంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీ యూనిట్లో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో మంటలు చెలరేగాయి. […]
LPG Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,803 ఉండగా.. దీనిపై రూ.41 తగ్గించింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,762 వరకు తగ్గింది. ఈ ధరలు గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. కాగా, గతేడాది కమర్షియల్ […]
New rules from April 1st: మార్చి నెల ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల్లో పలు కీలక మార్పులు వచ్చాయి. ఇంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఇన్కమ్ టాక్స్ మార్పులు, కొత్త శ్లాబులు నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే రూ.12 లక్షల వరకు ప్రీ టాక్స్, టీడీఎస్, టీసీఎస్ మార్పులు, క్రెడిట్ కార్డు నిబంధనలు, యూపీఐ సేవలు, మినిమిం బ్యాలెన్స్, గ్యాస్ […]
Girija Vyas : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. తాజాగా రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో తన ఇంట్లో పూజలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే పూజ సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్‌కు తరలించినట్లు సమాచారం. తన నివాసంలో ఆమె హారతి ఇస్తుండగా, కింద వెలుగుతున్న దీపం […]
Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ ప్రాంతంలో ఇవాళ భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ, బీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీఆర్జీ సిబ్బంది యాంటీ-నక్సలైట్ […]