Home / అంతర్జాతీయం
Xi Jinping : భారత్, చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పరస్పర అభినందన సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు, డ్రాగన్‌లా అభివృద్ధి చెందాలన్నారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య తీవ్ర ఘర్షణతో రెండు దేశాల మధ్య స్తంభించిన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్న […]
Ameica President Donald Trump’s reciprocal tariffs from April 2: అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు ఇతర దేశాలపై టారిఫ్ సుంకాలను విధించనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ట్రంప్ ఏప్రిల్ 2న ఫైనల్ నిర్ణయాన్ని తెలపనున్నారు. అయితే ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇతర దేశాల దిగుమతులపై టారిఫ్ సుంకాలు లేదా […]
Former Pakistan PM Imran Khan nominated for Nobel Peace Prize: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు పాకిస్థాన్ వరల్డ్ అలయన్స్, నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ వెల్లడించాయి. కాగా, పాకిస్థాన్‌లో మానవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కృషిని గుర్తించి నామినేట్ […]
Americans are buying second passports: ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన పౌరుడు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటాడు. అమెరికా పౌరసత్వం లభించిందంటే జన్మధన్యమైందని భావిస్తాడు. మరి అలాంటిది అమెరికా పౌరులే ఇతర దేశాలకు పౌరసత్వం కోసం పోటీ పడుతున్నారు. రెండవ పాస్‌పోర్టు కోసం క్యూ కడుతున్నారు. అమెరికా పౌరసత్వం కోసం పోటీ అంతా ఇంతా కాదని యావత్ ప్రపంచానికి తెలుసు. కొందరు సక్రమ మార్గం ద్వారా వెళితే.. మరి కొందరు అక్రమ మార్గం ద్వారా వెళుతుంటారు. […]
Pakistan : అఫ్గానిస్థాన్ నుంచి వచ్చి పాకిస్థాన్‌లో ఉంటున్న వారిపై ఇస్లామాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. 30 లక్షల మంది అఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రాణాళికలు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అఫ్గాన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారు తమ దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గానిస్థాన్ వాసులను, ఇతర విదేశీయులను తిరిగి పంపడానికి 2023 అక్టోబర్ […]
EarthQuake : మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీన్ని తీవ్రత 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. వెంటనే సహాయక బృందాలు స్పందించాయి. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీస్తున్నారు. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం సంభవించింది. దీంతో రోడ్లు, వంతెనలు, కమ్యూకేషన్ వ్యవస్థ […]
Earthquake Again in Myanmar: మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండియా కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బర్మా నగరానికి సమీపంలోని నేపై టావ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. హూమికి దాదాపు 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండడంతో భారీ ప్రమాదం […]
Russia President Vladimir Putin suggests putting Ukraine under UN-sponsored external governance: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. యుద్ధం మొదలై నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టినా.. పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ట్రంప్ జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు చొరవ తీసుకున్నా.. అవి ముందకు సాగడం లేదు. జెలెన్ స్కీపై ఒత్తిడి తెచ్చి అలివిగాని షరతులు విధిస్తున్నా.. మరో పక్క పుతన్ను పల్లెత్తు మాట అనడం లేదు ట్రంప్. ఇదే అలుసుగా […]
Earthquake of 7.7 magnitude hits Bangkok, Myanmar: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్, మయన్మార్‌లలో భారీ భూకంపం చోటుచేసుకుంది. కేవలం 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు సంభవించిన భూకంపాలతో ప్రజలు వణికిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 6.4, 7.7గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ భూకంపాల ధాటికి చాలా భవనాలు కుప్పకూలగా.. మరికొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో […]
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది ప్రధాని మోదీ మాస్కో పర్యటన సందర్భంగా భారత్‌లో పర్యటించాలని పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇండియా పర్యటన ఖరారైనట్లు రష్యా వర్గాలు ధ్రువీకరించాయి. 2022లో ఉక్రెయిన్ భీకర యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ చేస్తున్న తొలి పర్యటన ఇదే. పుతిన్ భారత్ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు తేదీలు ఖరారు కాలేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ […]